కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి: హోం మంత్రి అనిత

కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి: హోం మంత్రి అనిత

 

అక్షర ఉదయమ్ – కర్నూలు

 

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ హోం మంత్రి అనిత వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో ఏపీ, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, ఒడిశా, బిహార్ నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉంది. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత, రాం ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. 9 మంది క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హోం మంత్రి వెల్లడించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. అతడు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయన్నారు. చనిపోయిన వ్యక్తుల డీఎన్ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

 

 

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.