మూడు దశాబ్దాల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన 30 అతి కీలకమైన పథకాలు
– గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం తొలిసారి సెప్టెంబర్ 1వ తేదీన 1995లో ఇదే రోజున సిఎంగా బాధ్యతలు చేపట్టారని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన 30 అతి కీలకమైన పథకాలు, కార్యక్రమాలు, సంస్కరణలతో రాష్ట్ర ప్రజలు, మహిళలు ఎన్నో సంక్షేమ పథకాలను అందుకుంటున్నారని చెప్పారు. దేశంలోనే సంచలనం.. ప్రజల వద్దకు పాలన తీసుకు వచ్చిన వారిలో మొదటి సీఎంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారని కొనియాడారు. ముందెన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యంతో జన్మభూమి కార్యక్రమంతో ఎన్నో పల్లెలు, పట్టణాల్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో పాటు, బాలికా విద్యకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. మహిళలకు దీపం పథకం ఏర్పాటు చేశారని, కుల వృత్తులకు గౌరవం కల్పించారని, బిసిలకు ఆదరణ పథకం, ఎస్సీల రక్షణ కోసం కమిషన్ సూచనల అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
బిసిలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మైనారిటీలకు సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు అందిస్తూ, తొలి సారి డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు చేశారని చెప్పారు. విద్యుత్ రంగ సంస్కరణల అమలు, ఫలితాల సాధన, ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం, టెలికాం సంస్కరణలకు కీలక సూచనలు, పిపిపి విధానంలో నేషనల్ హైవేస్ కు అంకురార్పణ గ్రామగ్రామాన రోడ్ల నిర్మాణం, ఐటీకి ప్రాధాన్యత కల్పించడం జరిగిందని వివరించారు. హైటెక్ సిటీ నిర్మాణం, పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటు, విజన్ 2020తో పాలనకు కొత్త రూపు, విద్యా రంగంలో మార్పులు – 1.80 లక్షల టీచర్ల నియామకం, నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికారని అన్నారు.
స్ధానిక టూరిజానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, దేవాలయాల పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్ తో సేవలు సులభతరం చేశారన్నారు. డిజిటల్ కరెన్సీ కమిటీకి, స్వచ్ఛ భారత్ కమిటీకి నేతృత్వం వహించారని, పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు, రైతుల కోసం దేశంలో తొలి సారి ఇజ్రాయిల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీతో అన్నదాతకు అండ, రైతులకు సబ్సిడీలు, యాంత్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు.
నదుల అనుసంధానంలో చేయడంలో గట్టి కృషి చేసి విజయం సాధించారని, అట్టడుగున ఉన్న దళితుల కోసం ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని చెప్పారు. రియల్ టైం గవర్నెన్స్ – పారదర్శక పాలనను అందించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టి ఆంధ్రులు గర్వ పడే విధంగా అమరావతి నిర్మాణం చేశారని చెప్పుకొచ్చారు. పేదరికం నిర్మూలించడం కోసం P4 తో రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించారని ఎమ్మెల్యే యరపతినేని తెలిపారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..