గివింగ్ బ్యాక్ టూ సొసైటీ

గివింగ్ బ్యాక్ టూ సొసైటీ

అక్షర ఉదయమ్ – గుంటూరు

గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ఎదురు తమ కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని జీయంసీ అధికారులు తొలగించారని, టిఫిన్ బండి పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక వెంకట్రావుపేట కు చెందిన ఆలవాల యశ్వంత్ అనే బాలుడు సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాల్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. నాగలక్ష్మి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించి జీజీహెచ్ ఎదురు టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కేటాయించడం జరిగింది. ఈ విషయం పత్రికలు, టీవీ లలో వచ్చిన వార్తల నేపధ్యంలో గివింగ్ బ్యాక్ టూ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించి మంగళవారం సాయంత్రం కలక్టరేట్ వద్ద కలెక్టర్ గారి చేతుల మీదుగా బాలుడి తల్లి అలవాల రాధికకు టిఫిన్ బండి అందజేశారు.

తమ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా కొత్త టిఫిన్ బండి అందజేసిన గివింగ్ బ్యాక్ టూ సొసైటీ స్వచ్చంధ సేవా సంస్థ ప్రతినిధులకు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ గివింగ్ బ్యాక్ టూ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించారు. సేవా భావంతో చేసే కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయన్నారు. సమాజసేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిన ఎవరైనా సరే సమాజం కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించాలని, ఉన్నత కుటుంబాలకు చెందిన వారు దీన్నో బాధ్యతగా భావిందాలని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. నాగలక్ష్మి గారు సూచించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in