ఆపరేషన్ – ఈగల్ – స్టేట్ వైడ్ రైడ్స్ ఆన్ ఒరిస్సా బౌండ్ ట్రైన్స్

అక్షర ఉదయమ్ – విజయవాడ
GRP, RPF, లోకల్ పోలిస్, డాగ్ స్క్వాడ్, మరియు ఈగల్ సిబ్బంది సంయుక్త మత్తుపదార్థాల నిరోధక చర్య
అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. శ్రీ, హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఈగల్ శ్రీ ఆకే రవికృష్ణ., ఐ.పి.ఎస్. గారి అధ్వర్యంలో ఈగల్, G.R.P, .R.P.F, లా & ఆర్డర్ పోలీస్ మరియు డాగ్ స్క్వాడ్ భాగస్వామ్యం తో “డ్రగ్స్ రహిత రైల్వే రవాణా” ముఖ్య ఉద్దేశ్యంతో “జాయింట్ రైల్ బేస్డ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాము.

ముఖ్య ఉద్దేశ్యం:
- రైల్వే రవాణా ఆధారంగా ఏర్పడిన గంజాయి సప్లై చైన్ ను నిర్వీర్యం చేయడం.
- డ్రగ్స్ పై పనిచేసే అన్ని వ్యవస్థల మధ్య సమన్వయం కలుగ చేసి డ్రగ్స్ విస్తరణను నియంత్రించడం.
- డ్రగ్స్ నిర్మూలనకు విజిబుల్ యాక్షన్ (Visible Action) చర్యల ద్వార నిందితులలో భయాన్ని కలుగజేయడం.
- తనిఖీ, పరిశీలనా, స్వాదీన సమయాలలో చట్టానికి లోబడి పనిచేసి పారదర్శక విధనాన్ని ప్రజలకు తెలియజేయడం.

ఈ ఆపరేషన్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా నుండి ప్రవేశిస్తున్న మరియు రాష్ట్రం మీదుగా వెళ్లే ప్రధాన రైళ్ళను ఎంచుకొని, సరిహద్దు స్టేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముగింపు స్టేషన్ వరకు, ఒకేసారి ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ సహకారం తీసుకోవడమేకాక, ముందస్తు సమాచారం ఆధారంగా, ముఖ్యమైన రైళ్లు అయిన రాయగడ ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్ మొదలైన రైళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది.
ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో కనీసం 2 టీమ్లు (ప్రతి టీంలో 12 మంది సభ్యులతో పాటు ఒక మహిళ పోలీసును) కూడా ఏర్పాటుచేయడం. మొత్తం 26 జిల్లాలలో టీమ్లు ఏర్పరచి, ప్రతి టీమ్ 30 నుండి 50 కిలోమీటర్ల పరిధిలో రైలు మార్గాలను తనిఖీ నిర్వహిస్తారు.

ఈ జాయింట్ ఆపరేషన్లో సుమారు 400 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
ఈ ఆపరేషన్ ద్వారా మత్తుపదార్థాల (గంజాయి అక్రమ రవాణా పట్ల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్టంగా మార్చేందుకు మరో దృడ సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం.
ఆపరేషన్ సమయంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను ముందుగానే అంచనా వేసి, అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటూ టీమ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులతో ఎప్పటికప్పుడు ఈగల్ హెడ్ క్వార్టర్ పర్యవేక్షిస్తుంది.
ఈ జాయింట్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైలు మార్గాలలో జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలనకు కీలకమైన మైలురాయి అవుతుందని మేము భావిస్తున్నాం.
ఒరిస్సా నుండి గంజాయి చాల వరకు ట్రైన్స్ ద్వార రవాణా జరుగుతున్నట్లు వివిధ గణాంకాలలో నిరూపితమైనందున అట్టి అక్రమ రవాణాను కట్టడి చేయుటలో భాగంగా ఆపరేషన్ – ఈగల్ – స్టేట్ వైడ్ రైడ్స్ ఆన్ ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ ఆపరేషన్స్ ను నిర్వహించుటకు ప్రణాళికను రూపొందించడమైనది.
తేది 03.07.2025న “ఆపరేషన్ – ఈగల్ – స్టేట్ వైడ్ రైడ్స్ ఆన్ ఒరిస్సా బౌండ్ ట్రైన్స్” లో భాగంగా ఐజిపి శ్రీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ గారు, డి సి పి శ్రీమతి సరిత గారు, ఎస్పి శ్రీ కె. నగేష్ బాబు గారు, ఏలూరు జిల్లా పోలీసులు, జి.ఆర్.పి. డిఎస్పి, సిబ్బంది మరియు ఈగల్ అధికార్లు టీమ్ గా ఎర్పడి ఏలూరు నుండి విజయవాడ కు వస్తున్న కోరమండల్ express లో తనిఖీలను పర్యవేక్షించారు.
జి.ఆర్.పి. సిబ్బంది విజయవాడ వారు ట్రైన్ చెక్ చేస్తుండగా బీహార్ నుండి చెన్నై కి తరిలిస్తున్న రెండు కేజీల గంజాయిని (చాకులైట్ల రుపంలో) కలిగి ఉన్న వ్యక్తిని పట్టుకొని అతని పై కేసు నమోదు చేయడమైనది.

ఇప్పటివరకు
- విజయవాడ రైల్వే స్టేషన్ నందు కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో 2 పాకెట్స్ గంజాయి చాక్లెట్స్ ను
- తెనాలి రైల్వే స్టేషన్ నందు జసీదీహ్ – తాంబరాం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2 పాకెట్స్ గంజాయి చాక్లెట్స్ ను
- విజయనగరం రైల్వే స్టేషన్ నందు రాయఘడ ఎక్స్ప్రెస్ పదిహేను కేజీలు గంజాయి
- విజయనగరం రైల్వే స్టేషన్ నందు రాయఘడ ఎక్స్ప్రెస్ నాలుగు కేజీలు గంజాయి.
ఈ సందర్భంగా ఐ.జి.పి.గారు మాట్లాడుతూ తనిఖీలను రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..