రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ

 

అక్షర ఉదయమ్ – రాజంపేట

నిన్న రాత్రి లారీ బోల్తా పడి.. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం.

రోజూవారీ కూలీ పనుల చేసుకునే వారు, విధి లేని పరిస్థితిల్లో ఆ లారీపై ప్రయాణించడం దురదృష్టకరం.

ఈ ప్రమాదంలో 5 గురు మహిళలు, 4 గురు మగవారు చనిపోయారు.

మరో 5 మందికి గాయాలయ్యాయి… ఇక్కడ స్థానికంగా 4 గురు అడ్మిట్ కాగా, 4 గురిని కడప రిమ్స్ కు రిఫర్ చేయడం, ఒకరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించాం.

ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలు మంచిది కాదని, ప్రభుత్వాలు చెబుతున్నా.. వారి బతుకు తెరువు కోసం.. ప్రయాణం చేసిన పరిస్థితి.

చనిపోయిన వాళ్లంతా దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన దగ్గర బంధువులునే విషయం.. మనస్సును మరింత కలసివేచింది.

గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన మంత్రి.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సూపరిండెంట్ కు మంత్రి ఆదేశం.

ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రితో మాట్లడటం.. ఆయన సూచనల మేరకు బాధితులను పరామర్శించడం జరిగింది.

భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోకూడదనే కోరుకుంటున్నాం.

ఈ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి, నిర్ణయం తీసుకుంటాం.

ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే నివేదికలు అధికారుల నుంచి తీసుకోవడం, ప్రభుత్వానికి పంపడం జరిగింది.

బాధిత కుటుంబాలను వీలైనంత మేరకు ప్రభుత్వం ఆదుకుంటుంది.

ముఖ్యమంత్రి, ప్రభుత్వం తరపున ఆయా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.

అక్కడ వర్షం పడటం.. అదే సమయంలో ముందున్న వాహానాన్ని లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో, పక్కకు జారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాద స్థలంలో సూచికలు, సైన్ బోర్డులు వంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే, ఆర్ & బీ శాఖ తరపున ఆయా చర్యలు ఖచ్చితంగా చేపడతాం.

భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపడతాం.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in