తెనాలి పట్టణంలో గంజాయి ముఠా గుట్టురట్టు
- 13 మంది అరెస్ట్, 21 కేజీల గంజాయి స్వాధీనం

అక్షర ఉదయమ్ – తెనాలి
ఒడిస్సా రాష్ట్రం నుండి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి గంజాయిని విక్రయిస్తున్న ముఠా.
నిందితుల్లో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తితో పాటు 12 మంది తెనాలి, పరిసర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.
వీరిలోని నలుగురు వ్యక్తులు గంజాయి కేసులతో పాటు పలు దొంగతనాల కేసుల్లో నిందితులు.
ఒక వ్యక్తిపై రౌడీ షీట్, ఇద్దరు వ్యక్తులపై సస్పెక్ట్ షీట్లు నమోదైనవి.
తెనాలి సబ్ డివిజన్లో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై పీడీ చట్టం ప్రయోగించడం జరిగింది.మరొక 05 మంది వ్యక్తులపై పీడీ చట్టం ప్రయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది.

గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై PIT NDPS చట్టం కింద జైలుకు పంపడం జరుగుతుంది.
తెనాలి పట్టణంతో పాటు గుంటూరు జిల్లాలో గంజాయి నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపిన ఎస్పీ గారు.
ఈ రోజు తెనాలి డిఎస్పీ గారి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని గంజాయి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు.

ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ
ఈరోజు తెనాలి రూరల్ పోలీస్ వారికి గంజాయి సరఫరాకి సంబంధించి రాబడిన సమాచారం మేరకు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగలకుదురు గ్రామ శివారులో కొంతమంది గుంపుగా ఏర్పడి గంజాయిని పంచుకుంటూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని సుమారు 21 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది.
అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా ఒడిస్సా రాష్ట్రం, గంజాం జిల్లా, బరంపూర్ గ్రామానికి చెందిన బసంతి. నాయక్@ సమీర్ నాయక్, S/o లక్ష్మణ్ నాయక్, A/25 సం.రాలు అనే అతను కొంతకాలం క్రితం ప్రత్తిపాడు మండల పరిధిలోని దాసరిపాలెం గ్రామంలో కాంక్రీట్ పనుల నిమిత్తం వచ్చి ఉంటుండగా, అతనికి స్థానికంగా ఉంటున్న షేక్ గౌస్, S/o హుస్సేన్ 34 సం.రాలు దాసరిపాలెం గ్రామము, గుంటూరు రూరల్ అనే అతనికి పరిచమయ్యి, గౌస్ ద్వారా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగం జాగర్లమూడి గ్రామంలో నివాసం ఉండే మహమ్మద్ అబ్దుల్ రషీద్, S/o జాఫర్ సాదిక్ 25 సం.లు అనే అతన్ని పరిచయం చేసుకుని ముగ్గురూ కలసి వారికి తెలిసిన మరి కొంతమందినీ కలుపుకొని ఒక ముఠాగా ఏర్పడి బసంతి. నాయక్ ఒడిశా రాష్ట్రం నుండి అక్రమంగా తీసుకువచ్చిన గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తూ డబ్బులను సంపాదిస్తున్నారని, ఈ క్రమంలో ఈరోజు ఒడిస్సా రాష్ట్రం నుంచి వసంత నాయక్ తెచ్చిన 21 కేజీల గంజాయిని ఈ ముఠా సభ్యులు పంచుకుంటూ ఉండగా తెనాలి రూరల్ మరియు కొల్లిపర పోలీసులు వారి మీద దాడులు జరిపి వారిని అదుపులోకి తీసుకొని గంజాయిని సీజ్ చేయడం జరిగినది.
ఈ దాడుల్లో గంజాయి సరఫరా, విక్రయం, వినియోగం చేసే మొత్తం 13 మందినీ (వీరిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు). అదుపులోకి తీసుకోవడం జరిగినది.వీరిలో నలుగురు వ్యక్తులు గంజాయి కేసులతో పాటు పలు దొంగతనాల కేసుల్లో నిందితులకు ఉన్నారు.

వారి వివరాలు:
1) మహమ్మద్ అబ్దుల్ రషీద్ పైన షుమారు 4 గంజాయి కేసులు, 10కి పైగా దొంగతనం కేసులు ఉండటం వలన అతని పైన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ నందు Suspect sheet తెరవటం అయినది.
2) షేక్ నాగూర్ పైన షుమారు 2 గంజాయి కేసులు, 05 దొంగతనం కేసులు ఉండటం వలన అతని పైన తెనాలి III పట్టణం పోలీస్ స్టేషన్ నందు Suspect sheet తెరవటం అయినది.
3) రాహుత్ సాల్మన్ @ కాటరాజుపైన షుమారు 1 గంజాయి కేసు, 18 కి పైగా దొంగతనం కేసులు ఉండటం వలన అతని పైన తెనాలి III వ పట్టణం పోలీస్ స్టేషన్ నందు Rowdy sheet తెరవటం అయినది.
4) బాలసాని.ప్రభాస్ @ పండు పైన ఒక గంజాయి కేసు, 5కి పైగా దొంగతనం కేసులు నమోదు అయి ఉన్నాయి.
తెనాలి సబ్ డివిజన్ పరిధిలో గడిచిన ఆరు నెలల కాలంలో 53 మందిపై 10 గంజాయి కేసులు నమోదు చేసి, రూ.5,14,000/– విలువైన 35.15 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మరియు గౌరవ రాష్ట్ర డీజీపీ గార్ల ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికైనా గంజాయి సరఫరా విక్రయం వినియోగం మొదలగు అంశాలపై ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే స్థానిక పోలీస్ వారికి గాని, 112 లేదా ఈగల్ (EAGLE) టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా గాని తెలియపర్చాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ గారు తెలిపారు.
గంజాయి ముఠా చైన్ లింక్ ఛేదించుటలో కృషి చేసిన తెనాలి రూరల్ సీఐ ఉమేష్ గారు, తెనాలి రూరల్ ఎస్సై ఆనంద్ గారు, కొల్లిపర ఎస్సై కోటేశ్వరరావు గారు, కానిస్టేబుళ్లు రవి, సుబ్బారెడ్డి, ప్రసాద్లకు ప్రశంసా పత్రాలను అందించి శ్రీ ఎస్పీ గారు అభినందించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..