ప్రస్తుత AP మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు రద్దుపరచి, దాని స్థానంలో కొత్తగా రూపొందింఛిన “కాంప్రహెన్సివ్ A.P మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025” ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది

ప్రస్తుత AP మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, 2023లో G.O Ms No.38, G. A. (I&PR) Dept., dt.30.03.2023ను రద్దుపరచి, దాని స్థానంలో కొత్తగా రూపొందింఛిన “కాంప్రహెన్సివ్ A.P మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025” ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అక్షర ఉదయమ్ – అమరావతి

కొత్త సమగ్ర మరియు సమీకృత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025కు కేబినెట్ ఆమోదం కోరుతూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్, పబ్లిషింగ్ సెంటర్లు మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ మంజూరు చేయడం కోసం ఉన్న ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2023, G.O. Ms. No. 38, GA (I&PR) శాఖ, dt.30.03.2023ను జారీ చేసిన ఉత్తర్వుల స్థానంలో క్రొత్తగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025 అమలులోకి రానుంది.
దీనిలో ముఖ్యంగా, రాష్ట్రంలోని వివిధ జర్నలిస్టు సంఘాలు అభ్యర్ధించిన మేరకు నూతనంగా రూపొందించిన మీడియా నిబంధనలలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులకు అర్హత మేరకు రాష్ట్ర మరియు జిల్లా అక్రిడిటేషన్ కమిటీలలో స్థానం లభించనుంది.

చిన్న వార్తాపత్రికల కేటగిరీకి చెందిన జర్నలిస్టులకు సహేతుక సంఖ్యలో అక్రిడిటేషన్లను మంజూరు చేసే సౌకర్యం కల్పించేందుకు ఎంపానెల్డ్ మరియు నాన్-ఎంపానెల్డ్ కేటగిరీలుగా చిన్న వార్తాపత్రికల వర్గీకరణ చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాలపై సమాచారాన్ని పొంది దానిని ప్రజలకు వ్యాప్తి చేయడానికి మీడియాకు అక్రిడిటేషన్ సౌకర్యం అందించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు విస్తరించబడుతుంది మరియు ఆంధ్రప్రదేశ్ అధికార పరిధిలో ఉంటుంది.

ఎంతో కాలంగా జర్నలిస్టులు, వారి సంఘ ప్రతినిధులలో నెలకొన్న పలు మీమాంసలు ఈ క్రొత్త మీడియా రూల్స్ వలన తొలగనున్నాయి. క్రొత్త మీడియా అక్రిడిటేషన్ నిభందనల ప్రకారం అతిత్వరలో అక్రిడిటేషన్ మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, రాష్ట్ర , జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల నియామకం జరగనుంది. సోషల్ మీడియాకి సంబందించి కూడా ఒక పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.