గుంటూరు నగరంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అమలు

అక్షర ఉదయమ్ – గుంటూరు
ప్రయాణికుల భద్రతను పెంపొందించడంతో పాటు అనధికార ఆటో డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ ఎంతో ఉపయోగపడుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అన్నారు.
ఈరోజు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ వద్ద ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ నంబర్ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొని, ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేసిన శ్రీ ఎస్పీ గారు.

ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ:
ఈ ట్రాఫిక్ పోలీస్ నంబర్ కేటాయింపు ప్రక్రియ 2025 ఫిబ్రవరి నెలలో ప్రారంభించబడింది.
ఫిబ్రవరి 2025 నుండి జూలై 2025 వరకు మొత్తం 10,600 ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్లు జారీ చేయబడ్డాయి.
అయితే ఇప్పటికీ సుమారు 5,000 ఆటోలు ట్రాఫిక్ పోలీస్ నంబర్ పొందకుండా నడుస్తున్నాయి.
ట్రాఫిక్ పోలీస్ నంబర్ పొందని ఆటో డ్రైవర్లు వెంటనే తమ సరైన ధృవపత్రాలతో ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాన్ని సంప్రదించాలి.
ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి వచ్చేనెల (సెప్టెంబర్) ఆఖరు వరకు గడువు ఇవ్వబడుతుంది. ఆ తరువాత ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము.
ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు పలువురు ఆటో డ్రైవర్లతో సరదాగా ముచ్చటించి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

ఫీల్డ్ ఇన్స్పెక్షన్లలో గమనించిన అంశాలు:
కొందరు ఆటో డ్రైవర్లు రోడ్లపై ఆటోలు నిలుపుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సహించబడవు, అటువంటి వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోబడతాయి.

ట్రాఫిక్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ గారి సూచనలు:
- సమర్ధవంతంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించి, ప్రజల్లో పోలీస్ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలి.
- ట్రాఫిక్ డైవర్షన్లను కఠినంగా అమలు చేయాలి.
- డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి.
- ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధులలో ఉన్నప్పుడు తప్పనిసరిగా రేడియం జాకెట్లు ధరించడం, బ్యాటన్ లైట్లు వాడడం వంటివి చేయాలి.
- ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య తలెత్తినప్పుడు వెంటనే స్పందించి పరిష్కరించాలి.
- ఈస్ట్ మరియు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో పని చేయాలి.
- ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
ఈ సందర్భంగా వర్షంలో కూడా ట్రాఫిక్ విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి శ్రీ ఎస్పీ గారు రెయిన్ కోట్లను అందించారు.
శంకర్ విలాస్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్దికరణలో భాగంగా పలు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడం జరిగింది.కావున వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ గారు, ఎస్సైలు రవీంద్ర బాబు గారు, శ్రీహరి గారు, సాంబశివరావు నాయక్ గారు, నరేంద్ర గారు, RSI మదన్ గారు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..