తాకట్టులో ఉన్న బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామని బంగారం వ్యాపారిని మోసపూరితంగా పిలిపించి దాడి చేసి 4 లక్షల నగదు దోపిడికి పాల్పడిన కేసును ఛేదించిన వేటపాలెం పోలీసులు

తాకట్టులో ఉన్న బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామని బంగారం వ్యాపారిని మోసపూరితంగా పిలిపించి దాడి చేసి 4 లక్షల నగదు దోపిడికి పాల్పడిన కేసును ఛేదించిన వేటపాలెం పోలీసులు.

 

అక్షర ఉదయమ్ – చీరాల

 

తాకట్టులో ఉన్న బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామని బంగారం వ్యాపారిని మోసపూరితంగా పిలిపించి దాడి చేసి 4 లక్షల నగదు దోపిడికి పాల్పడిన కేసును ఛేదించిన వేటపాలెం పోలీసులు

కేసు వివరాలను వెల్లడించిన చీరాల డీఎస్పీ ఏమ్.డి. మోయిన్

ఇటీవల బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం లోని వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో తాకట్టులో ఉన్న బంగారాన్ని విక్రయిస్తామని మోసపూరితంగా విజయవాడకు చెందిన బంగారపు వ్యాపారిని పిలిపించి అతనిపై దాడికి పాల్పడి, చంపుతామని బెదిరించి నాలుగు లక్షల రూపాయల నగదును దోపిడి చేసిన నిందితులను వేటపాలెం పోలీసులు అరెస్టు చేసినారు. ఆదివారం వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దాయిల అరెస్టుకు సంబంధించిన వివరాలను చీరాల డిఎస్పి ఎమ్.డి.మోయిన్ వెల్లడించారు.

నేరం:
Cr.No:165/2025 u/s 318(4), 109(1), 308(5), 351(2) r/w 3(5) BNS

ముద్దాయిల వివరాలు:
1. మల్లి @ ముంగా @ మల్లెల రాజేష్ s/o శామ్యూల్, 37 సం!!, ST ఎరుకల, లక్ష్మీపురం, వేటపాలెం. (A-1)

2. కావటి నాగరాజు s/o మోహన రావు, 38 సం!!, ST ఎరుకల, యానాది సంగం, దండుబాట, చీరాల (A-2).

3. అన్నారెడ్డి మధు (A-3)

4. అన్నారెడ్డి మహేంద్ర s/o మధు, 24 సం!!, ST ఎరుకల, యానాది సంగం, కొత్తపాలెం, చీరాల (A-4)

5. అన్నారెడ్డి ఇంద్ర @ బబ్లు s/o మధు, 24 సం!!, ST ఎరుకల, యానాది సంగం, కొత్తపాలెం,చీరాల, (A-5).

6. మల్లి @ ముంగా @ మల్లెల మౌనిక @ మౌనిశ w/o రాజేష్ s/o శామ్యూల్, 37 సం!!, ST ఎరుకల, లక్ష్మీపురం, వేటపాలెం (A-6).

7. చిన్నబోతుల చంటి S/o శేఖర్ రావు, 50 సం!!, ST ఎరుకల, 2nd గ్యాంగ్, స్టువర్టుపురం ఎంq, వెదుల్లపల్లి మండలం (A-7).

స్వాధీనం చేసుకున్న వాటి వివరములు:

1. రూ.3,00,000/- నగదు
2. సాంసంగ్ గెలాక్సీ A35 మొబైల్
3. నేరానికి పాల్పడినప్పుడు ఉపయోగించిన ఆటో
4. నేరంలో ఉపయోగించిన కత్తులు.

కేసు వివరాలు:
బ్యాంకులో బంగారం తాకట్టు ఉంటే వాటిని విడిపించి మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలు చేసి కమిషన్ తీసుకొని మిగిలిన డబ్బులు ఇస్తామని సోషల్ మీడియా వేదికగా విజయవాడకు చెందిన ఎస్.విఆర్ ఎస్.కే గోల్డ్ లిమిటెడ్ వారు యాడ్ పోస్ట్ చేసినారు. ఈ యాడ్ ను చూసిన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంకు చెందిన మల్లి @ ముంగా @ మల్లెల రాజేష్ అతని ముఠా సభ్యులైన కావటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర @ బబ్లు, మల్లి @ ముంగా @ మల్లెల మౌనిక @ మౌనిశ, చిన్నబోతుల చంటి S/o శేఖర్ రావులు ఒక ముఠాగా ఏర్పడినారు. వీరు మోసం చెయ్యాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం 4 లక్షల విలువగల బంగారం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టులో ఉందని వాటిని విడిపించి డబ్బులు ఇవ్వాలని విజయవాడకు చెందిన రెహమాన్ ను ఫోన్ ద్వారా సంప్రదిస్తారు. వారి మాటలు నమ్మిన రెహమాన్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనుగోలు చేసేందుకు ది:20.08.2025 చీరాల రావడంతో అతడిని నమ్మబలికి వేటపాలెం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని మల్లి రాజేష్ ఇంటి వద్దకు తీసుకు వెళ్ళినారు. ముందుగా పన్నిన పథకం ప్రకారం రెహమాన్ ను కత్తులతో భయపెట్టి, బెదిరించి అతని వద్ద ఉన్న 4 లక్షల రూపాయల నగదు, జేబులో ఉన్న డబ్బులు, శామ్సంగ్ కంపెనీ మొబైల్ ఫోన్ తీసుకొని కత్తులతో చంపడానికి ప్రయత్నించగా తృటిలో వారి భారీ నుండి తప్పించుకున్నాడు. తప్పించుకునే క్రమంలో నుదిటిపైన రక్త గాయం అయినది. అంతటా చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరి ఇచ్చిన పిర్యాదు మేరకు వేటపాలెం ఎస్.ఐ పి.జనార్ధన్ కేసు నమోదు చేసినారు.

బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఇచ్చిన ఆదేశాల మేరకు చీరాల డిఎస్పి ఎమ్.డి.మోయిన్ సూచనలతో చీరాల రూరల్ సిఐ పి.శేషగిరి రావు పర్యవేక్షణలో వేటపాలెం ఎస్సై పి.జనార్ధన్, వేటపాలెం పోలీస్ స్టేషన్ పిఎస్ఐ జగజ్జీవనరావు రావు, స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ముద్దాయిల ఆచూకీ గుర్తించి ఆదివారం ఉదయం మల్లి @ ముంగా @ మల్లెల రాజేష్, కావటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర @ బబ్లు, మల్లి @ ముంగా @ మల్లెల మౌనిక @ మౌనిశ, చిన్నబోతుల చంటి లను అరెస్టు చేయడం జరిగింది. కేసుతో సంబంధం ఉన్న అన్నారెడ్డి మధు, అన్నారెడ్డి మహేంద్ర లు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కొరకు విస్తృత గాలింపు కొనసాగుతుంది.

రెహమాన్ ను బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసును సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛేదించి, చాకచక్యంగా ముద్దాయిలను అరెస్ట్ చెయ్యడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చీరాల రూరల్ సీఐ, వేటపాలెం ఎస్సై, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ అభినందించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in