విశాఖలో ‘సేనతో సేనాని’ కార్యక్రమం

విశాఖలో ‘సేనతో సేనాని’ కార్యక్రమం

 

అక్షర ఉదయమ్ – విశాఖపట్నం

 

ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖలో విస్త్రృతస్థాయి భేటీ నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి విశాఖలో ఆయన ‘సేనతో సేనాని’ కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. “ ఈ నెల 29న పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చర్చిస్తాం. పర్యావరణం, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన, ఏడాది నుంచి అందించిన సుపరిపాలనపై చర్చిస్తాం. ఈ నెల 30న జనసేన మహాసభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు” అని నాదెండ్ల తెలిపారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in