ర్యాపిడో డ్రైవర్లుగా మహిళలు:  మంత్రి లోకేశ్

ర్యాపిడో డ్రైవర్లుగా మహిళలు:  మంత్రి లోకేశ్

‘స్త్రీ శక్తి’ ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం గొప్ప విజయమని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మరోవైపు ర్యాపిడో భాగస్వామ్యంలో వెయ్యి మందికి పైగా మహిళా డ్రైవర్లకు ఉపాధి కలగడం సంతోషమని చెప్పారు. మహిళలు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. రవాణా ప్రణాళిక (మొబిలిటీ) అంటే కేవలం ప్రయాణం కాదు.. ఇది అవకాశం, గౌరవం అని పేర్కొన్నారు. ముమ్మాటికీ ఇది మంచి ప్రభుత్వమే అని వివరించారు. మహిళల ర్యాపిడో వాహనాల డ్రైవింగ్పై ఓ వీడియోను లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

– ” అక్షర ఉదయమ్” న్యూస్