తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు

 


అక్షర ఉదయమ్ – తిరుమల

సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు:

సెప్టెంబర్ 24న సాయంత్రం 05.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ.

25న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.

26న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ.

27న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవ.

28న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి వరకు గరుడ వాహన సేవ.

29న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ.

30న ఉదయం 8 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభవాహన సేవ.

అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ.

2న ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in