వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రష్యా క్యాన్సర్ వాక్సిన్

ఎంటెరోమిక్స్ అని పిలవబడే ఈ వ్యాక్సిన్ నాలుగు నాన్-పాథోజెనిక్ (హానికరం కాని) వైరస్‌లతో తయారుచేసారు. అవి క్యాన్సర్ కణాలను నేరుగా లక్ష్యంగా చేసి నాశనం చేస్తాయి. అంతే కాకుండా ఈ వైరస్‌లు రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి, క్యాన్సర్‌ను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడేలా చేస్తాయి. అంటే రెండు రకాల పనులు చేస్తాయన్నమాట. ఒకటి ఆంకోలిసిస్ అనగా ట్యూమర్ ని నాశనం చేయడం. రెండు యాంటీ-ట్యూమర్ రోగనిరోధకశక్తిని యాక్టివేట్ చేయడం. కీమోథెరపీ లేదా రేడియేషన్‌కు భిన్నంగా, ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను కాపాడుతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమీ చూపలేదు. రోగులు దీనిని బాగా తట్టుకున్నారు.
18-75 సంవత్సరాల వయస్సు గల 48 వాలంటీర్స్ తో ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ మూడు నెలల క్రితం మొదలు పెట్టారు. సెప్టెంబర్ 6 వ తేదీన ప్రిలిమినరీ డేటా రష్యా ఆరోగ్య శాఖకు సబ్మిట్ చేసారు. ఆ రిపోర్ట్ ప్రకారం 100% saftey profile కన్ఫర్మ్ అయింది. మూడు నెలల్లో 60-80% ట్యూమర్ సైజ్ తగ్గింది. ఈ మొత్తం ట్రయల్స్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వాలంటీర్లు అందరూ కీమో థెరపీ, రేడియేషన్ లాంటి ఇతర ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక కూడా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నవారు. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్. ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.
మిగిలిన క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకొని వీలైనంత త్వరలో బయటకు వస్తుంది. బయటకు వచ్చాక ఈ వ్యాక్సిన్ ని రష్యాలో ఉన్న క్యాన్సర్ బాధితులందరికీ ఫ్రీగా ఇవాలని నిర్ణయం తీసుకున్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..