పల్నాడు జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా కృతిక శుక్లా బాధ్యతల స్వీకరణ
– స్వాగతం పలికిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు
పల్నాడు జిల్లా నూతన కలెక్టర్‌గా కృతిక శుక్లా శనివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కృతిక శుక్లాను కలిసి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు మొదటి మహిళా కలెక్టర్‌గా కృతిక శుక్లా నియామకం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు జిల్లాలోని అర్హులందరికీ ఎటువంటి ఆటంకం లేకుండా అందేలా చూడాలని కోరారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా సానుకూలంగా స్పందిస్తూ, నిష్పక్షపాతంగా పని చేస్తూ జిల్లాను అభివృద్ధి మార్గంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆమె అభిప్రాయ పడ్డారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి కృతిక శుక్లా నాయకత్వం కీలకంగా మారనుందని, ఆమె నియామకం జిల్లా ప్రజల్లో సానుకూల అంచనాలను రేకెత్తిస్తోందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
