ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

అక్షర ఉదయమ్ – న్యూఢిల్లీ
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. సీఎం వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. కర్నూలులో ఈ నెల 16న ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి, విశాఖలో జరిగే సీఐఐ సదస్సుకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రజాసేవలో 25 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధానికి అభినందనలు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ తరఫున ప్రధానికి కృతజ్ఞతలు చెప్పినట్లు భేటీ అనంతరం చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు వివరాలు వెల్లడించారు.


Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.