ఆక్వా పార్క్, ఓడరేవు నిర్మాణం ద్వారా మత్స్య, ఆక్వా రంగం మరింత అభివృద్ధి కానుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు

అక్షర ఉదయమ్ – బాపట్ల
బుధవారం,నిజాంపట్నం మండలంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్, ఓడరేవు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు.
నిజాంపట్నం మండలం, యామినేనివారిపాలెం లో 192.42 ఎకరాలలో ఆక్వా పార్క్ అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ ఆక్వా పార్క్ వలన మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.మత్స్య సంపద అభివృద్ధికి ఈ పార్క్ కేంద్రం కానుందన్నారు. ఆక్వా పార్క్ అభివృద్ధికి టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించకపోవుటకు కారణాలను, అడ్డంకులపై మేరటైన్ బోర్డు అధికారులను ఆయన ఆరా తీశారు. ఆక్వా పార్క్ అభివృద్ధి ప్రాంతంలో చిల్ల మొక్కలను తొలగించి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు టి వి వి ఎస్ యన్ కాంట్రాక్టర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. పార్కు అభివృద్ధికి నిధులు మంజూరైనాయని పనులను వెంటనే ప్రారంభించి ఒక సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నిజాంపట్నంలోని ఓడరేవు అభివృద్ధి పనులకు 2022 సంవత్సరంలో అగ్రిమెంట్ తీసుకొని, ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవుటకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆరా తీశారు. ఓడరేవులో జెట్టి నిర్మాణ పనులు పూర్తయినాయని, బ్యాక్ వాటర్ పనులు ప్రారంభించి మూడు మాసములలో పూర్తి చేస్తామని అధికారులు ఆయనకు వివరించారు. పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఆక్వా పార్కు మరియు ఓడరేవు అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులతో వాట్స్అప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్వా పార్క్ మరియు ఓడరేవు పనుల పురోగతిపై ప్రతి బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ జె డి శ్రీనివాస్ నాయక్, ఉప సంచాలకులు గాలిదేవుడు, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, నిజాంపట్నం ఇన్ఛార్జి తహసిల్దార్ శ్రీనివాసరావు, మేరటైన్ బోర్డు డి.ఈ సూర్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.