భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

 

అక్షర ఉదయమ్ – అమరావతి

నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి & దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది.

దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాబోయే 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.