చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో కొత్త మలుపు

అక్షర ఉదయమ్ – చిలకలూరిపేట
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఈ నెల 4న చిలకలూరిపేట వద్ద కంటైనర్ ఢీకొని ఐదుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
పోలీసుల విచారణలో ప్రమాదానికి కారణం కంటైనర్ వాహనాన్ని రోడ్డుపై అకస్మాత్తుగా ఆపడం వల్లే అన్న నిర్ధారణకు అధికారులు వచ్చారు. ఆ సమయంలో హైవేపై కంటైనర్‌ను “బ్రేక్ ఇన్స్పెక్టర్” పేరుతో ఆపిన వ్యక్తి, నిజానికి నరసరావుపేట డీఎస్పీ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఏఎస్సై కుమారుడని విచారణలో బయటపడింది.
స్థానికంగా “బ్రేక్ ఇన్స్పెక్టర్” అవతారం ఎత్తి హైవేలపై వాహనాలను ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ వసూళ్ల గ్యాంగ్‌లో ఏఎస్సై కుమారుడు ప్రధాన పాత్రధారీగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదే వ్యక్తి గతంలో 2023లో నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ ఒక వ్యక్తిని రూ.40 లక్షలతో ఉడాయించిన సంఘటనలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలిసింది.
జిల్లాలో పలు ప్రాంతాల్లో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏఎస్సై కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిలకలూరిపేట పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.