ఏటిగట్టు వద్ద స్కూల్ బస్సు బోల్తా

అక్షర ఉదయమ్ – తూర్పుగోదావరి
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉండ్రాజవరం మండలం తాటిపర్రులోని జ్యోతి స్కూల్ కు చెందిన విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది.
బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ఆయా పద్మావతి కాలికి తీవ్ర గాయం కావడంతో తణుకు ఆసుపత్రికి తరలించారు.
ఒక్కసారిగా బస్సు పల్టీ కొట్టడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.