ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీలు నిర్వహించేందుకు చర్యలు: మంత్రి కందుల దుర్గేష్

ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీలు నిర్వహించేందుకు చర్యలు: మంత్రి కందుల దుర్గేష్

 

అక్షర ఉదయమ్ – విజయవాడ

 

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

విజయవాడ సిద్ధార్థ కళాశాలలో జరిగిన అమరావతి బాలోత్సవంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ పోటీలను పరిశీలిస్తూ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. చిన్నారుల్లోని సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి బాలోత్సవాలు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా, విలువలతో కూడిన విద్యా విధానాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయాల నుండి పుట్టిన మాక్ అసెంబ్లీ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రజాస్వామ్య అవగాహనను పెంచిందని దుర్గేష్ ప్రసంశించారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేయాలని సూచించారు. పిల్లల చదువుతో పాటు ఆటపాటలలోనూ పాల్గొనమని, అప్పుడు మాత్రమే వారిలో దాగిన ప్రతిభ బయటపడుతుందని అన్నారు.

చివరిగా, పిల్లల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి, బాలోత్సవం నిర్వాహకులను అద్భుతంగా నిర్వహించినందుకు అభినందించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.