రైతుల మిత్రుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శంకరరావు ను అభినందించిన మంత్రి నాదెండ్ల
- రైతుల సేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన శంకరరావు
- కష్టాల్లో ఉన్న రైతులకు సహాయంగా నిలిచిన శంకరరావు తీరుపై మంత్రి ప్రశంసలు
- స్వగ్రామ రైతులకోసం తన డబ్బులతోనే సహాయం చేసిన యువ ఇంజినీర్
- ‘రైతు భరోసా కేంద్రాల వద్ద సమస్యల పరిష్కారంలో ఆదర్శంగా నిలిచాడు’: మంత్రి వ్యాఖ్య

అక్షర ఉదయమ్ – గుంటూరు
పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరడాన శంకరరావు కృషిని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందించారు.
రైతులకు అండగా నిలబడుతున్న తీరుపై మంత్రి శంకరరావుకు స్వయంగా ఫోన్ చేసి ప్రశంసలు కురిపించారు. కష్ట సమయంలో రైతులకు అందిస్తున్న సహాయం ప్రశంసనీయమని పేర్కొన్నారు. శంకరరావు చేస్తున్న సేవలు ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శంకరరావు 2019లో స్వగ్రామాన్ని సందర్శించినప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా గమనించాడు. రైతు భరోసా కేంద్రాల్లో సంచులు లేకపోవడం, వాహనాల కొరత, ధాన్యం కొనుగోలులో జాప్యం వంటి అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు.
రైతులు దళారీలకు ధాన్యాన్ని అమ్మాల్సిన పరిస్థితులు మారాలన్న ఉద్దేశంతో స్వయంగా ముందుకొచ్చాడు. తన సొంత డబ్బులతో రైతులకు సంచులు అందించడం, ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం వంటి బాధ్యతలు స్వీకరించాడు. రైతులకు వడ్డీలేని పెట్టుబడులు అందిస్తూ సాయం చేశాడు. సగటున ఒక్క రైతుకు లక్ష రూపాయల వరకు సహకారం అందించినట్లు తెలుస్తోంది.
ఈ సేవాభావం, గ్రామీణ రైతుల పట్ల కట్టుబాటు చూసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి అభినందించడం గ్రామస్థులను ఆనందంలో ముంచెత్తింది. శంకరరావు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, “రైతుల సంతోషమే నా ప్రేరణ” అని అన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.