వాట్సప్ గవర్నెన్స్, సాంకేతిక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు

వాట్సప్ గవర్నెన్స్, సాంకేతిక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు

 

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనలో నూతన దిశను సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ, సామర్థ్య పెంపు, పారదర్శకత, వేగవంతమైన సేవలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

 

వాట్సప్ గవర్నెన్సు సేవలను మరింత మెరుగుపరచే చర్యలు తీసుకోవాలి. డిజి వెరిఫై-ఏపీ ద్వారా ధృవపత్రాల భద్రతను ఏర్పాటు చేయాలి. ఏపీపీఎస్సీతో లింక్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది రోజువారీ విధులకు తప్పనిసరిగా హాజరు కావాలి. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.

దూరప్రాంతాల్లో 4జి టవర్ల ప్రాజెక్టును మార్చి నాటికి పూర్తి చేయాలి. బీఎస్ఎన్ఎల్, జియో టవర్ల ఏర్పాటుకు కలెక్టర్లు వారితో సహకరించాలి. మారుమూల గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ త్వరితగతిన పూర్తి చేయాలి. ఉద్యోగుల సామర్థ్య పెంపుకు ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల మందికి పైగా ట్రైనింగ్ లభించింది.

 

జిల్లాల బెస్ట్ ప్రాక్టీస్‌లను ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలి. లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధ్యమే. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ ద్వారా ఈ వృద్ధి సాధ్యమవుతుంది. గత ప్రభుత్వం నుంచి 70 శాతం ధ్వంసమైన రోడ్లు, నీటి సమస్యలు, రైతులకు మద్దతు ధరలు లేకపోవటం, భూ వివాదాలు, ఎక్కువ విద్యుత్ బిల్లులు వారసత్వంగా లభించాయి.

నీటి భద్రత సాధించాము, రైతులకు మెరుగైన ధరలు కల్పిస్తున్నాము, విద్యుత్ చార్జీలు పెంచకుండా తగ్గించాము ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వసనీయత వచ్చింది. గ్రీవెన్సులను త్వరగా పరిష్కరించి ఆన్‌లైన్‌లో పారదర్శకత చేయాలి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచాలి. చేసిన పనులను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి.

కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లు, ప్రభుత్వంపై సానుకూలతకు అధికారుల పాత్ర కీలకం. పొలిటికల్ గవర్నెన్స్ అవసరం. కలెక్టర్ల ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ప్రతి నిమిషం స్వీయ ఆత్మపరిశీలన చేసుకోవాలి. స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాము. వైద్యారోగ్యంలో ప్రీవెంటివ్, క్యురేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్‌మెంట్ అమలు చేయాలి.

పౌరసేవల ద్వారా ప్రజల్లో సంతృప్తి పెంచాలి. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువతకు మేలు చేయాలి. ప్రజాప్రతినిధుల సేవలను వాడుకోని గవర్నెన్స్ డెలివరీ స్పీడ్ పెంచాలని సూచించారు.