అన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యతపై జిల్లా కలెక్టర్ తనిఖీ

అన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యతపై జిల్లా కలెక్టర్ తనిఖీ

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు.

బుధవారం మిర్చి యార్డులోని అన్న క్యాంటీన్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, శుభ్రత, నిర్వహణ అంశాలను పరిశీలించారు. అనంతరం కార్మికులు, రైతులు, డ్రైవర్లతో కలిసి కలెక్టర్ స్వయంగా భోజనం తిన్నారు. కార్మికులను అభిప్రాయాలు అడిగి తెలుసుకోగా, అక్కడ లభిస్తున్న సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.

పేదలకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. క్యాంటీన్ ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచి, భోజనశాలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలని, మౌలిక సదుపాయాల సంరక్షణపై నగరపాలక అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.