ట్రూఅప్ ఛార్జీల భారాన్ని భరించేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం

విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు పెట్టిన ట్రూఅప్ ప్రతిపాదనల తిరస్కరణ.
రూ.4,497.89 కోట్ల భారాన్ని ప్రజలపై మోపకుండా, స్వయంగా భరించేందుకు సిద్ధమైన సర్కార్.
ట్రూఅప్ ఛార్జీల మొత్తాన్ని తామే డిస్కంలకు చెల్లిస్తామని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ.
ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1,551.69 కోట్లు, సీపీడీసీఎల్ పరిధిలో రూ.1,163.05 కోట్లు, ఈపీడీసీఎల్ పరిధిలో రూ.1,783.15 కోట్ల మేర భారాన్ని భరించనున్న ఏపీ ప్రభుత్వం.
అక్షర ఉదయమ్ – అమరావతి