కాల్స్ ‘ఫార్వర్డ్’తో టోకరా

కాల్స్ ఫార్వర్డ్తో టోకరా

 

 

కోడ్ అడిగి.. కాల్స్ ‘ఫార్వర్డ్’తో టోకరా వేసి..

మొబైల్ ఫోన్లో ఉండే కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ అమాయకులను దోచుకోవడానికి మోసగాళ్లకు ఉపయోగ పడుతుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) జారీ చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం మోసగాళ్లు సాధారణ ప్రజలకు ఫోన్ చేసి, తాము కొరియర్ లేదా డెలివరీ సర్వీస్ ఏజెంట్లుగా చెప్పుకుంటున్నారు.

ప్యాకేజీని కన్ఫర్మ్ చేయాలని, లేదా రీ షెడ్యూల్ చేయాలని సాకు చెప్తున్నారు.

ఈ సంభాషణ సాధారణమైనదిగానే కనిపిస్తుంది.

డెలివరీ విషయంలో ఓ చిన్న సమస్య వచ్చిందని, వివరాల ధ్రువీకరణ కోసం ఓ చిన్న కోడ్ ని డయల్ చేయాలని చెప్తారు.

ఈ కోడ్ ను ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. ఈ కోడ్ కి ముందు 21, 61 లేదా 67 ఉంటాయి.

ఈ కోడ్ ని డయల్ చేసిన వారి ఫోన్ కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది.

ఇన్ కమింగ్ కాల్స్ అన్ని ఆ మోసగాళ్ల నియంత్రణలో ఉన్న ఫోన్ నంబరుకు పంపిస్తుంది.

యూఎస్ఎస్ఈ కాల్స్ దుర్వినియోగం

అన్స్టక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్ఓ) అనే టెలికాం ప్రోటోకాల్ వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నెట్వర్క్ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు.

దీనిని ఈ కుంభకోణానికి మోసగాళ్లు ఉపయోగించు కుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే వెరిఫికేషన్ కాల్స్, చెల్లింపుల కోసం వచ్చే కన్ఫర్మేషన్ ఓటీపీలు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఫ్లాట్ ఫారం నుంచి వచ్చే ఆథెంటికేషన్ మెసేజులు యూజర్లకు కాకుండా మోసగాళ్లకు చేరుతాయి. గుర్తు తెలియని కాలర్లు పంపించే యూఎస్ఎస్ఓ కోడ్స్ ప్రారంభంలో 21. 61 లేదా 67 ఉంటే, ఆ కోడ్లను డయల్ చేయవద్దు.

కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేషన్లో ఉందని యూజర్లకు అనుమానం వస్తే, వెంటనే ##002# కు డయల్ చేసి అన్ని ఫార్వర్డింగ్ సర్వీసులను డీయాక్టివేట్ చేయాలి.

బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫోన్ చేయాలి.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్