శ్రీకాకుళంలో విజయవాడ పిఐబి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

    Date:

    📰 Generate e-Paper Clip

    శ్రీకాకుళంలో విజయవాడ పిఐబి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

    • మీడియా అవగాహన సదస్సు నిర్వహణ
    • ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీడియా వారధిలా కీలక పాత్ర పోషిస్తుంది

    అక్షర ఉదయమ్ – శ్రీకాకుళం

    భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) విజయవాడ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ జి.సురేష్ కుమార్ శ్రీకాకుళంలో జిల్లా, గ్రామీణ విలేకరుల కోసం ఒక రోజు ‘పిఐబి వార్తాలాప్’ మీడియా అవగాహన సదస్సును ప్రారంభించారు.
    కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంతో పాటు, అభివృద్ధి సంబంధిత జర్నలిజం, విజయగాథల కవరేజ్, సోషల్ మీడియా మెళకువలు, నకిలీ సమాచారాన్ని  నిరోధించడం, పత్రికా సమాచార కార్యాలయ పని తీరుపై అవగాహన కల్పించేందుకు విజయవాడ పిఐబి ప్రాంతీయ కార్యాలయం ఈ సదస్సును నిర్వహించింది.

    ఈ సదస్సులో జర్నలిస్టులను ఉద్దేశించి పిఐబి డైరెక్టర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలపై నిజమైన, సమయానుకూల సమాచారాన్ని అందిస్తూ ప్రభుత్వం, మీడియా మధ్య పిఐబి కీలక వారధిగా వ్యవహరిస్తుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వివిధ ప్రతిష్టాత్మక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మీడియాకు విస్తృత అవగాహన కల్పించడంలో సహాయ పడతాయని పేర్కొన్నారు.

    కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సదస్సును ఉద్దేశించి ప్రత్యేక సందేశం పంపించారు పిఎం ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, పిఎం విశ్వకర్మ, స్కిల్ ఇండియా, పిఎమ్‌ఇజిపి, పిఎంకెవివై వంటి పథకాలు యువత కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ యువత ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని కె.రామ్మోహన్ నాయుడు నొక్కి చెప్పారు. ప్రజల సంక్షేమానికే భారత ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల ఫలాలను ప్రజలకు చేరవేసేలా మీడియా విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాల మెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా కేంద్ర మంత్రి వివరించారు.

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వ విద్యాలయం జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ రెడ్డి తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామీణ సమస్యలు, గ్రామీణ ప్రజల ఆందోళనలపై ఎక్కువ దృష్టి సారిస్తూ ‘డెవలప్‌మెంటల్ జర్నలిజం’ (అభివృద్ధి జర్నలిజం) చేయాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. విలేకరులు గొంతు లేని వారి గొంతుకని, గ్రామీణ సమస్యలను వెలుగులోకి తెచ్చి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో తోడ్పడగలరని అన్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడటానికి వాటిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. పథకాల ప్రయోజనాల్ని, లబ్ధిదారుల జీవితాలు ఎలా మారుతున్నాయో తెలిపే కథనాలు రాయాలని, అదే సమయంలో పథకాల సమర్థవంతమైన అమలు కోసం నిర్మాణాత్మక విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

    లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉద్యోగాలు కల్పించే వారిగా మారేందుకు బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా తోడ్పడుతుందో వివరించారు. కేంద్ర సాయంతో నడిచే పథకాలు, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మీడియాను కోరారు. సమాచార, పౌర సంబంధాల శాఖ డిఐపిఆర్ఓ చెన్నకేశవరావు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె.వి.రమణ, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సీనియర్ అధికారులు ఈ సదస్సులో ప్రసంగించారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది....