ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్ఐ గారికి ఘన సన్మానం

“మీరు భావితరాలకు ఆదర్శం – మీ సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం.” అనే సంకల్పంతో, పల్నాడు జిల్లా పోలీస్ శాఖలో దీర్ఘకాలం పాటు సేవలందించి 31.08.2025వ తేదీన ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్ఐ 2460 AVS రవి కుమార్ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.
జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ గారి చాంబర్ నందు ఈ సన్మాన కార్యక్రమం జరగగా, జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి, సేవల పట్ల గౌరవాన్ని తెలిపి, ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్ఐ గారి సేవలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ:
- గతంలో ఉన్న నక్సలిజం, రవాణా సౌకర్యాల కొరత, ఇతర సవాళ్ల మధ్య ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించారని తెలిపారు.
- ఈ సేవల వెనుక కుటుంబ సభ్యుల త్యాగం, సహకారం ఎంతో ఉంది అని అభినందించారు.
- “మీరు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. దేవుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ కుటుంబ సభ్యులతో శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటున్నాను” అని ఎస్పీ గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.మాణిక్యాల రావు గారు, పోలీసు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అక్షర ఉదయమ్ – పల్నాడు
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..