ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ
ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా అధికారుల్ని బదిలీలు చేసింది. మొత్తం పది మంది కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు బదిలీపై వెళ్లారు. అలాగే పోస్టింగ్ వేచి ఉన్న కొంతమందికి అవకాశం కల్పించారు. ఈ బదిలీలకు సంబందించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. విజయవాడ కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కె.శివరాం ప్రసాద్ బదిలీపై వెళ్లారు. ఆయన్ను ప్రభుత్వం పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ కమిషనర్‌గా నియమించింది....