నాడు భర్త, ఇప్పుడు కుమార్తె దూరమై తల్లడిల్లిన తల్లి
నాడు భర్త, ఇప్పుడు కుమార్తె దూరమై తల్లడిల్లిన తల్లి కర్నూలులో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన ఇంకొల్లు మండలం పూసపాడులో విషాదం నింపింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ గన్నమనేని ధాత్రి (27) తల్లి వాణి రోదన స్థానికులకు కంటతడి పెట్టించింది. రెండేళ్ల కిందట అనారోగ్యంతో భర్త మరణించగా, ఏకైక కుమార్తె బస్సు ప్రమాదంలో శాశ్వతంగా దూరం కావడంతో ఆమె వేదన వర్ణనాతీతం. యద్ధనపూడి మండలం పూనూరుకు చెందిన గన్నమనేని భానుప్రకాష్ గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు....