ఏపీలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా – త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు  

ఏపీలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా ప్రమాదంలో మృతి చెందితే కుటుంబానికి రూ.10 లక్షలు త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు     అక్షర ఉదయమ్ - విశాఖపట్నం   రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించిందని, పాలసీ త్వరలోనే అమల్లోకి రానుందని మంత్రి వెల్లడించారు.   ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం...