ఏపీ ప్రభుత్వానికి అంబులెన్సులు అందజేసిన సోనూసూద్

అక్షర ఉదయమ్ - అమరావతి  - అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్   నటుడు, ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్‌ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులను అందించారు.   సచివాలయంలో మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభినందించారు.   ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలని చంద్రబాబు అన్నారు.