ఐదు జిల్లాల మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్

అక్షర ఉదయమ్ - అమరావతి   గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాజధాని నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ కూడా సమాంతరంగా నిర్మించేందుకు అవసరమైన పనులన్నీ ఆదివారం చక చకా సాగుతున్నాయి. ఓఆర్ఆర్ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189. 9 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. రహదారులతో అనుసంధానం...