రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
- ఫలించిన చంద్రబాబు విశేష కృషి
- రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
- యూరియా వినియోగం ఎక్కువగా ఉండే సెప్టెంబర్ మాసానికి అధిక మొత్తంలో యూరియా దిగుమతి అవుతున్నందుకు రైతుల హర్షాతిరేకం
- కేవలం చంద్రబాబు నాయుడు వల్లే అని ప్రశంసించిన రైతు సంఘాలు
- గత నెల ఆగస్టు నెల నుంచి చేసిన కేటాయింపు 81000 మెట్రిక్ టన్నుల యూరియాకు అదనంగా ప్రస్తుతం 50000 కేటాయింపు
- మరో రెండు రోజుల్లో కాకినాడ, విశాఖ, మంగళూరు, జైగర్ నౌకాశ్రయాలకు చేరుకోనున్న ఓడలు
- నౌకాశ్రయంల నుండి సత్వరమే మన ప్రాంతానికి రైల్వే గూడ్స్ రేకుల ద్వారా ఎరువుల సరఫరాకు కొంకణ్ రైల్వే, దక్షిణ రైల్వే ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు

అక్షర ఉదయమ్ – అమరావతి
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ , ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగంలో యూరియా సరఫరా విషయంలో సంక్షోభం, ప్రతిష్ఠంభన ఏర్పడిన ఈ కీలక సమయంలో రాష్ట్ర రైతాంగానికి ముఖ్యంగా సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులకు యూరియా విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగి, వరసగా కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా కేంద్ర ఎరువుల రసాయనిక మంత్రి నడ్డాతో జరిపిన చర్చల ద్వారా, రాష్ట్ర రైతుల అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్లడంలో చేసిన విశేష కృషి పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇచ్చి, ప్రస్తుత ఈ కీలక సమయంలో 50000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయింపు చేసినందుకు రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.
విలేకరులతో మాట్లాడుతూ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సి ఐ యల్) ద్వారా కాకినాడ పోర్టుకు 17294 మెట్రిక్ టన్నులు, ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపియల్) మంగళూరుకు 5400 మెట్రిక్ టన్నులు, నర్మదా కంపెనీ నుండి జైగర్ పోర్టుకు 10800 మెట్రిక్ టన్నులు, నేషనల్ ఫెర్టిలైజర్స్ నుండి విశాఖకు 15874 మెట్రిక్ టన్నుల యూరియా రాబోయే రెండు రోజుల్లోపు రాష్ట్రానికి చేరుతున్నాయని తెలిపారు.
ఈ కేటాయించిన 50000 మెట్రిక్ టన్నుల యూరియా ఆగస్టు నెలకు కేటాయించిన 82151 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపుకు అదనమని చెప్పారు. 41183 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేయటం జరిగిందని, మిగిలిన 40968 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు సిద్ధంగా ఉండి, రవాణాలో ఉందని తెలిపారు.
రైతులు ధైర్యంగా ఉండాలని, ఎటువంటి కొరత లేదని తెలిపారు. శాస్త్రీయంగా, తక్షణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే వ్యవసాయ అధికారుల నుంచి సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలని కోరారు. వ్యవసాయ సంచాలకులు ఢిల్లీ రావుకు సూచనలను చేస్తూ ఎరువుల వినియోగంపై గ్రామ స్థాయిలో క్షేత్ర సిబ్బంది ఔట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలని తెలియజేశారు.
రాష్ట్రానికి సమృద్ధిగా ఎరువులను కేటాయించడంలో తీవ్ర కృషి సలిపిన చంద్రబాబు నాయుడుకి మరొకసారి కృతజ్ఞతలు తెలిపారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..