అక్షర ఉదయమ్
Date of Publish : 11 February 2025, 12:56 am Posted by : అక్షర ఉదయమ్

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

అక్షర ఉదయమ్ – తిరుమల

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎల్వో శ్రీ వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.