అక్షర ఉదయమ్
Date of Publish : 24 February 2025, 12:15 am Posted by : అక్షర ఉదయమ్

ఏపీలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు

అక్షర ఉదయమ్ – అమరావతి

 

మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియేట్ పరీక్షల విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ సిఎస్ కె.విజయానంద్ తెలిపారు. పరీక్షల ఏర్పాట్ల పై తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.