అర్జీలు తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ తమీమ్ అన్సారియా

అర్జీలు తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ తమీమ్ అన్సారియా

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి, దరఖాస్తుదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి మొత్తం 260 అర్జీలు స్వీకరించారని పేర్కొన్నారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, విధివిధానాలకు అనుగుణంగా సకాలంలో పరిష్కారం చూపాలన్నారు.


ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.