అక్షర ఉదయమ్
Date of Publish : 03 November 2026, 10:44 am Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

తితిదే పాలక మండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం

అక్షర ఉదయమ్ – తిరుమల : 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవీ కాలం ముగియడంతో, నూతన పాలక మండలి ఏర్పాటు అయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది.

  • ప్రత్యేక అధికారుల కమిటీ వివరాలు

ముద్దాడ రవిచంద్ర – తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, కమిటీ ఛైర్మన్.

వి.వినయ్ చంద్ – ప్రభుత్వ కార్యదర్శి, ఆర్థిక శాఖ – సభ్యుడు.

కె.కన్నబాబు – ప్రభుత్వ కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ (ఎఫ్ఎసి) – సభ్యుడు.

ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం ఈ ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది.

ఈ కమిటీ టిటిడి పాలక మండలికి ఉండే అన్ని అధికారాలను వినియోగించడంతో పాటు, పాలక మండలి నిర్వహించాల్సిన అన్ని విధులను నిర్వహిస్తుంది.

  • పదవీకాలం

ఈ ప్రత్యేక అధికారుల కమిటీ ఒక సంవత్సరం పాటు లేదా నూతన పాలక మండలి ఏర్పాటు అయ్యే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటి వరకు కమిటీ పదవీకాలం ఉంటుంది.