అర్నబ్ తుపాన్ బీభత్సం – రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు

అక్షర ఉదయమ్, అమరావతి :  అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. తుపాన్ ప్రభావం మొదలైనప్పటి నుంచి నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పర్యటనకు బయలుదేరే ముందు కూడా అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించి విద్యుత్‌, రహదారులు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణలో పురోగతిని తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ సిబ్బందిని రప్పించి సరఫరా పునరుద్ధరణను వేగవంతం చేశారు....