అక్షర ఉదయమ్
Date of Publish : 05 December 2025, 12:56 pm Posted by : అక్షర ఉదయమ్

అమ్మగా… కలెక్టరమ్మ

అమ్మగా… కలెక్టరమ్మ

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

స్టాల్ బాలికల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌కు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా హాజరయ్యారు. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, చిన్నారులతో మాతృస్నేహంతో మాట్లాడారు. భవిష్యత్ లక్ష్యాలు నిర్ణయించుకుని, కలలు కని, శ్రద్ధగా చదవాలని ప్రోత్సహించారు.

 

 

బాల్యవివాహాలకు దూరంగా ఉండి, కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలని, ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. “జీవితంలో తొలి 25 సంవత్సరాలు కష్టపడి చదివితే, జీవితాంతం స్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని అన్నారు.

 

 

లైంగిక వేధింపులు జరిగితే భయపడకుండా పెద్దలకు తెలియజేయాలని, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.