అమ్మగా… కలెక్టరమ్మ
అమ్మగా… కలెక్టరమ్మ అక్షర ఉదయమ్ - గుంటూరు స్టాల్ బాలికల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌కు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా హాజరయ్యారు. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, చిన్నారులతో మాతృస్నేహంతో మాట్లాడారు. భవిష్యత్ లక్ష్యాలు నిర్ణయించుకుని, కలలు కని, శ్రద్ధగా చదవాలని ప్రోత్సహించారు. బాల్యవివాహాలకు దూరంగా ఉండి, కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలని, ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. "జీవితంలో తొలి 25 సంవత్సరాలు కష్టపడి చదివితే, జీవితాంతం స్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది"...