అక్షర ఉదయమ్
Date of Publish : 14 October 2025, 12:06 am Posted by : అక్షర ఉదయమ్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

 

  • సమస్యలు విన్నవించుకున్న 66 మంది అర్జీ దారులు
  • అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి
  • జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

 

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు నిర్వహించారు.

తమ సమస్యలను వెల్లబుచ్చుకోవడానికి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఎస్పీ స్వయంగా విని, వారు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు.

వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. వారి సమస్యలను చట్ట పరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు మరల మరల పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఎస్పీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అస్థి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో మొత్తం 66 మంది అర్జీలను అందజేసినారు.

ఈ కార్యక్రమంలో రేపల్లె డిఎస్పి ఏ.శ్రీనివాసరావు, బిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఎమ్. శ్రీనివాసరావు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.