జాగ్రత్త.. మళ్ళీ వర్షాలే వర్షాలు!
జాగ్రత్త.. మళ్ళీ వర్షాలే వర్షాలు! అక్షర ఉదయమ్ - అమరావతి ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని,దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణమధ్య బంగాళాఖాతం, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంంతాల్లో వాయుగుండముగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం,కోనసీమ,...