అక్షర ఉదయమ్
Date of Publish : 31 January 2025, 4:12 pm Posted by : అక్షర ఉదయమ్

రోడ్డు పై క్షుద్ర పూజలు కలకలం

అక్షర ఉదయమ్ – రావినూతల:

 

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఘటన శుక్రవారం ఉదయం కలకలం రేపింది.
అటుగా వెళ్తున్న గ్రామస్థులు రోడ్డు మీద ముగ్గు అందులో నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు, పసుపు ఉండటంతో భయంభ్రాంతులకు గురయ్యారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది అందరిని భయపెట్టడానికి ఆకతాయిలు చేసారా లేదా ఇతరులు ఎవరైనా చేశారా అనేది తెలియాల్సివుంది.