పుష్ప గుచ్ఛాలకు బదులు పుస్తకాలు

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    పుష్ప గుచ్ఛాలకు బదులు పుస్తకాలు

     

    • పల్నాడు జిల్లా అధికారుల ఆదర్శవంతమైన నూతన సంవత్సర వేడుకలు

     


    అక్షర ఉదయమ్ – నరసరావుపేట

    పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఇచ్చిన పిలుపు సాకారమైంది. ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు పుష్ప గుచ్ఛాలకు బదులుగా పుస్తకాలను బహుకరించాలని ఆమె కోరగా, జిల్లా అధికారులు ఆ పిలుపును స్ఫూర్తిగా తీసుకున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ శుక్లాకి పుస్తకాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 1300 నోటు పుస్తకాలు, డిక్షనరీలు, పెద్దబాల శిక్షలు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉపయోగ పడే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్‌ను కలెక్టర్‌కు అందజేశారు.

    విద్యార్థులకు చేరనున్న జ్ఞాన నిధి

    అధికారుల నుంచి అందిన ఈ పుస్తకాలను సద్వినియోగం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. వీటిని వివిధ ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేస్తారు. “పుష్ప గుచ్ఛాలు కొద్ది సేపటికే వాడిపోతాయి, కానీ పుస్తకాలు ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దుతాయి. ఈ సంప్రదాయం విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందిస్తుంది.” అని కలెక్టర్ కృతిక శుక్లా ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.
    పర్యావరణానికి మేలు చేస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేలా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...