అక్షర ఉదయమ్
Date of Publish : 09 September 2025, 4:25 pm Posted by : అక్షర ఉదయమ్

‘బగ్గీ అంబులెన్సు’

‘బగ్గీ అంబులెన్సు’

 

 

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కర్ణాటక ప్రభుత్వం మంగళూరులోని వెన్ లాక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ‘బగ్గీ అంబులెన్సు’ను ఏర్పాటు చేసింది. శస్త్రచికిత్స జరిగిన రోగులతో సహా ఇతర పేషెంట్లను వార్డులకు సులువుగా తరలించడానికి వీలుగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెన్ లాక్ ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్, ఇన్పేషెంట్ వార్డు, ఔట్ పేషెంట్ వార్డు, స్కానింగ్, ఎక్స్ రే విభాగాలు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. రోగులు ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా స్థానిక ఎమ్మెల్సీ ఐవాన్ డిసౌజా నిధుల నుంచి రూ.7 లక్షలు ఖర్చు చేసి దీన్ని కొనుగోలు చేశారు. ఇదొక బ్యాటరీ వాహనం. ఇందులో స్టీల్ స్ట్రెచర్ తో పాటు కొన్ని పరికరాలు ఉంటాయి. రోగిని తరలించడంతో పాటు డ్రైవర్ వెనుక రోగి బంధువులు కూర్చోవడానికి వీలుంటుంది. సింగిల్ ఛార్జింగ్ తో 40-45 కి.మీ ప్రయాణించే ఈ బాగ్గీ 400-500 కిలోల బరువు మోయగలుగుతుంది. గంటకు 25 కి.మీ వేగంతో వెళ్తుంది.

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in