అక్షర ఉదయమ్
Date of Publish : 30 October 2026, 12:03 am Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తోందని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి
పణితి రవికుమార్ అన్నారు.

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో రవి కుమార్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పి చేసే నాయకుడు, చేసింది చెప్పే విజనరీ, చెప్పింది చేస్తూనే ఉండే లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొనియాడారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా 16,347 పోస్టులతో “మెగా డీఎస్సీ” ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉద్యోగాలు, ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి వంటి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

చంద్రబాబు, పవన్, మాధవ్ ఆధ్వర్యంలో కూటమి బ్రహ్మాండమైన పాలన అందిస్తోందని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసకరమైన పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా చాలా వెనుక బడిపోయిందని, కూటమి ప్రభుత్వం ఆ తప్పులు సరి దిద్దుతూ చేస్తున్న పరిపాలన కారణంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు.

కులం, మతం చూడని కూటమి ప్రభుత్వం పాలనలో స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నామని, ముందుగానే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి, తుఫాను వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే అన్నారు.

కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం డబుల్ ఇంజిన్ వేగంతో అభివృద్ధి పరుగులు పెట్టిస్తోందని పణితి రవి కుమార్ చెప్పారు.

ప్రజా రాజధాని “అమరావతికి” నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగ వంతంగా బాటలు వేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి రాష్ట్రం త్వరగా కోలుకుంటుందని పేర్కొన్నారు. స్వదేశీ, విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షించి లక్ష కోట్ల పెట్టుబడులను పెట్టే విధంగా పెట్టుబడి దారులను ఆకర్షించి, రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోందని పణితి రవి కుమార్ వివరించారు.