వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు, బిల్ గేట్స్

    Date:

    📰 Generate e-Paper Clip

    వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు, బిల్ గేట్స్

    ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకు వచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.

    అక్షర ఉదయమ్ – ఉండవల్లి

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది....