అక్షర ఉదయమ్
Date of Publish : 20 May 2025, 2:32 pm Posted by : అక్షర ఉదయమ్

‘సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్‘ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

 


అక్షర ఉదయమ్ – అమరావతి

సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్‘ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని గురించి వివరిస్తూ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి డి.రాజేష్ కుమార్, రీచ్‌ ఎయిట్స్ ఈటీ & సీ ప్రైవేట్ లిమిటెడ్‌ ఎండీ డీ.ఏ.రాజు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారు. దీనిని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో సీఎం చంద్రబాబు జీవితాంశాలు, విజన్, విజయ సూత్రాలు, అభివృద్ధి విధానాలు వంటి వివిధ అంశాలను గురించి పొందు పరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో వీఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ బన్ బాబు తదితరులు ఉన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..