వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
అక్షర ఉదయమ్ - ఆచంట వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరపున మొట్ట మొదటి సారిగా పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు, స్త్రీల యొక్క ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన కలియుగ పార్వతి దేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారని ఆయన అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ ఆశీస్సులు మెండుగా కలుగుతాయని ఆయన...