ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన చీరాల రూరల్ పోలీసులు

అక్షర ఉదయమ్ – చీరాల
చీరాల మండలం అక్కాయపాలెం పంచాయతీ పరిధిలోని యానాది కాలనీలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బిట్ల సూరిబాబు(45) ను అరెస్టు చేసినట్లు చీరాల డిఎస్పీ మోయిన్ బుధవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు కాగానే మూడు పోలీసు బృందాలు గాలింపు జరిపి కటారిపాలెం జీడి తోటలో తలదాచుకున్న ముద్దాయిని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఈ పోక్సో కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేటట్లు చూస్తామన్నారు. చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.